నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఇటీవల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఐదవ సారి అయినా ప్రేక్షకుల ముందుకు అనుకున్న సమయానికి వస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ ఓమిక్రాన్ దెబ్బతో దురదృష్టవశాత్తు ఈ సినిమాని వాయిదా వేయక తప్పలేదు.
అయితే ఈ సినిమా వాయిదా పడగానే అభిమానులు మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా బాధ పడ్డారు అని తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు సమాచారం. న్యూయర్ ముందు వరకు కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో చాలా బిజీ గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే అంత కష్టపడి ప్రమోషన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా వాయిదా పడింది అని తెలియగానే షాకయ్యారు.
ఇక రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో కూడా ఏలాంటి పోస్ట్ చేయలేదు. ఇద్దరూ కాస్త ఒంటరిగానే డిప్రెషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి తర్వాత కథలపై కూడా ప్రస్తుతం చర్చలు జరిపే మూడ్ లో కూడా లేరని సమాచారం. కొన్ని రోజులపాటు ఒంటరిగానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వస్తోంది. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే సినిమా కోసం ప్రాణం పెట్టి ఎంతో కష్టపడి వర్క్ చేసిన అతిముఖ్యమైన దర్శకుడు రాజమౌళి ఇంకా ఏ తరహాలో ఉండే ఉంటాడు అనే ఆలోచన రాకుండా ఉండదు.
ఆయన కూడా ప్రస్తుతం చాలా సైలెంట్ గానే ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు. ఫిబ్రవరి మార్చిలో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉంటాయి. కుదిరితే ఏప్రిల్ నెలలోనే హాలిడేస్ సీజన్ లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.