దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తూ ఆ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ షూటింగ్ జరగుతుండగా ఈ నెల చివరినాటికి దాదాపుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరోక్షంగా రాజమౌళిపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మే నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ షో వాయిదా పడింది.
ఆగష్టు నెల నుంచి ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యమైతే ఎవరు మీలో కోటీశ్వరుడు షో కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని రాజమౌళిని కోరుతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యమైతే ఆ ప్రభావం తరువాత సినిమాలపై కూడా పడే అవకాశం ఉందని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ రాజమౌళికి పరోక్షంగా చుక్కలు చూపిస్తుండగా రాజమౌళి ఎన్టీఆర్ డిమాండ్స్ కు తలొగ్గుతారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం గమనార్హం. బిగ్ బాస్ షోకు తీసుకున్న పారితోషికంతో పోలిస్తే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎక్కువమొత్తం పారితోషికం తీసుకుంటున్నారు.