Jr NTR, Buchi Babu: బుచ్చిబాబుని ఎన్టీఆర్ వదిలేలాలేడుగా..!

‘ఉప్పెన‌’ అనే ఒక్క చిత్రంతో స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు బుచ్చిబాబు సానా.అయితే ‘ఉప్పెన’ రిలీజ్ అయ్యి 6 నెలలు కావస్తున్నా ఇంకా తన నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇవ్వలేదు ఈ యంగ్ డైరెక్టర్. కచ్చితంగా స్టార్ హీరోతోనే తన రెండో సినిమా చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నాడు. ఎన్టీఆర్ కు.. బుచ్చిబాబు అత్యంత సన్నిహితుడు.’నాన్నకు ప్రేమతో’ చిత్రం టైములోనే ఎన్టీఆర్..బుచ్చిబాబుల మధ్య కథా చర్చలు చాలానే జరిగాయి. ఆ టైంలోనే బుచ్చి బాబు పనితనానికి ఇంప్రెస్ అయిపోయి కచ్చితంగా నీతో ఓ సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాటిచ్చాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత కచ్చితంగా బుచ్చిబాబుతో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఇది ఓ స్పోర్ట్స్ డ్రామా అనే టాక్ కూడా నడుస్తుంది. అయితే.. ఎన్టీఆర్ కాల్ షీట్లు ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశం లేదు.అతను కొరటాల, ప్రశాంత్ నీల్ లతో సినిమాలు ఫినిష్ చేసుకుని రావాలి. కాబట్టి ఈలోగా మ‌రో సినిమా చేద్దామ‌నే థాట్ లో బుచ్చిబాబు ఉన్నాడు.అయితే ఎన్టీఆర్ మాత్రం 2022 జూలై నుండీ బుచ్చిబాబుతో సినిమా మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఈలోగా బుచ్చిబాబు తన రెండో సినిమా పూర్తి చేసుకుని ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుని, బుచ్చిబాబు ప్రాజెక్టుని ప్యారలల్ గా ఫినిష్ చేయాలనేది ఎన్టీఆర్ ఆలోచన. ఈ ప్రాజెక్టుని కూడా ‘మైత్రి మూవీ మేకర్స్’ వారే నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus