Jr NTR: అతని వల్ల ఎన్టీఆర్ చాలా డబ్బు నష్టపోయాడట.. నిజంగా షాకింగ్ విషయమే ఇది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. 18 ఏళ్ళ వయసుకే స్టార్ డంని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో.. అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ను చేరదీసి తన ఎన్టీఆర్ అన్న పేరుని గిఫ్ట్ గా ఇచ్చి ఆశీర్వదించారు. అటు తర్వాత ఓ సినిమా హిందీ వెర్షన్ కోసం ఎన్టీఆర్ ను తీసుకున్నారు కానీ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కాలం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పెద్ద బలం కోల్పోయినట్టు అయ్యింది.

అయినప్పటికీ హరికృష్ణ గారు పెద్ద నిర్మాతలతో సినిమాలు నిర్మించేలా చేశారు. ఆయనకు పెద్దగా స్టార్ డం లేదు కాబట్టి ఎన్టీఆర్ ను యువ దర్శకుల చేతిలో పెట్టడం జరిగింది. కానీ ఓ విధంగా అదే ప్లస్ అయ్యింది. వినాయక్, రాజమౌళి వంటి సరైన దర్శకుల్లోనే ఎన్టీఆర్ పడ్డాడు కాబట్టి అతనికి స్టార్ డం త్వరగా వచ్చింది. అయితే ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో చాలా మందిని బ్లైండ్ గా నమ్మేసేవాడు. దీంతో కొంతమంది చేతిలో ఎన్టీఆర్ మోసపోయాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ గా భావించిన ఓ వ్యక్తి వల్ల అయితే చాలా డబ్బు కోల్పోయాడట.

‘సింహాద్రి’ తో ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ వల్ల బడా ప్రాజెక్టులు ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ వచ్చాయి. అదే టైంలో చాలా మంది నిర్మాతలు ఎన్టీఆర్ కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్ … ఎన్టీఆర్ కాల్ షీట్లు ఇప్పిస్తాను అని చెప్పి చాలా డబ్బులు వసూల్ చేశాడట. ఈ విషయం ఎన్టీఆర్ కు మొదట్లో తెలీదు. అదే టైం ‘ఆంధ్రావాలా’ ‘నా అల్లుడు’ ‘సాంబ’ ‘నరసింహుడు’ వంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఎంతటికి ఇతను కాల్షీట్లు ఇవ్వడం లేదని సహనం కోల్పోయిన నిర్మాతలు.. ఎన్టీఆర్ వద్దకు వచ్చి నీ వల్ల మేము పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ లు కడుతున్నాం. మాకు కాల్ షీట్లు ఎందుకు ఇవ్వడం లేదు అని డిమాండ్ చేశారట. ఇందుకు ఎన్టీఆర్ అయోమయంగా ‘నేను కాల్ షీట్లు ఇస్తానని ఎప్పుడు చెప్పాను’ అంటూ అడిగాడట. దీంతో ఆ నిర్మాతలు ‘నీ స్నేహితుడి ద్వారా అడ్వాన్స్ లు తీసుకుని ఇప్పుడు ఇలా బుకాయిస్తున్నారా?’ అంటూ నిందలు వేశారు.

అప్పుడు ఎన్టీఆర్ ఆరాతీయగా అది నిజమే అని తేలింది. వాళ్లకు నచ్చచెప్పి భవిష్యత్తులో సినిమా చేస్తాను అని చెప్పినా వారు వినలేదట. ఇక చేసేదేమి లేక తన దగ్గర ఉన్న డబ్బులంతా ఇచ్చి ఆ నిర్మాతలకు సెటిల్ చేశాడట ఎన్టీఆర్. ఇక అప్పటి నుండి తన బెస్ట్ ఫ్రెండ్ ను కనీసం చేరదీయడం లేదని తెలుస్తుంది. నమ్మించి మోసం చేసే బ్యాచ్ అంతా తన చుట్టూ చాలా మంది ఉన్నారని ఎన్టీఆర్ తన స్నేహితుల వద్ద చెప్పుకొచ్చినట్టు స్పష్టమవుతుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus