Jr NTR: జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ చూశారా!

వరల్డ్ వైడ్ సెన్సేషన్ తర్వాత టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరం’ విదేశాల్లో మరింత సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. జపాన్ ప్రేక్షకుల కోరిక మేరకు అక్కడ ఈ అక్టోబర్ 21న ట్రిపులార్ భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం మూవీ టీం జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళి, ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, రామ్ చరణ్, ఉపాసన తదితరులు ఎయిర్ పోర్ట్ లో కనిపించిన పిక్స్, తారక్ అక్కడి వారితో మాట్లాడుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇప్పుడు మరో లేటెస్ట్ అండ్ క్రేజీ అప్ డేట్ తో ‘ఇదీ మా హీరో అంటే’ అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ట్రిపులార్ టీం జపాన్ క్యాపిటల్ టోక్యోలో పాపులర్ లగ్జీరియస్ హోటల్ అయిన ది రిట్జ్ కార్ల్టన్ (The Ritz-Carlton, Tokyo) లో దిగారు. అక్కడి హౌస్ కీపింగ్ సిబ్బంది అంతా తారక్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ అంట.

ఎన్టీఆర్ ని చూడగానే సర్ ప్రైయిజింగ్ గా ఫీలయ్యారు. ఫొటోలు దిగుతూ ఎగ్జైట్ అయ్యారు. తారక్ మీద తమకున్న అభిమానాన్ని లెటర్స్, గ్రీటింగ్ కార్డుల మీద రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారితో మాట్లాడుతూ, తన మీద అభిమానంతో వారు రాసిన గ్రీటింగ్ కార్డ్స్ అవీ చూస్తూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.

హౌస్ కీపింగ్ టీం తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు యంగ్ టైగర్ కాసేపు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. వారు చూపించిన అభిమానానికి థ్యాంక్స్ తెలియజేశాడు. ట్రిపులార్ ప్రమోషన్స్ తో పాటు అక్కడి వారితో కలిసి సినిమా చూడ్డం.. తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు ఇలాంటి క్రేజీ అప్ డేట్స్ తో తారక్, చరణ్ ఫ్యాన్స్ నెట్టింట హంగామా చేస్తూనే ఉంటారు..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus