Jr NTR: హర్ట్ అవుతున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్.. క్లారిటీ ఇస్తారా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నెలలో ప్రకటన వెలువడింది. గతేడాది ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో ఒక దశలో తారక్ కొరటాల శివ కాంబో మూవీ ఆగిపోయిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిర్మాతలు సైతం ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలపై స్పందించడం లేదు. రెండు వారాల క్రితమే ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వస్తుందని వార్త వైరల్ కాగా ఆ సమయంలో ఎలాంటి అప్ డేట్ రాలేదు.

దీపావళి పండుగపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది. దీపావళికి అయినా అప్ డేట్ ఉంటుందా తారక్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యమైనా పరవాలేదని ఎప్పటినుంచి ఈ సినిమా షూట్ మొదలవుతుందో చెబితే చాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్30 మూవీ హీరోయిన్ కు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది.

పూజా హెగ్డే నుంచి శ్రీలీల వరకు జాన్వీ కపూర్ నుంచి కియారా అద్వానీ వరకు అందరి పేర్లు ఈ సినిమాలో తారక్ కు జోడీగా వినిపించాయి. రష్మిక కూడా ఈ సినిమాలో నటిస్తారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. తారక్ కొరటాల శివ కాంబో మూవీ 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం ఈ సినిమాకు ఒక విధంగా మైనస్ అయింది. కొరటాల శివ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus