లాక్ డౌన్ వల్ల ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు ఇప్పుడు స్టార్ లు కూడా ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అభిమానులకు బోర్ కొట్టించకుండా సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉంటూ.. తమ ఫోటోలను … వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఇలా తమ అభిమానులను ఖుషీ చేయిస్తున్నారు.ఇదిలా ఉంటే… హీరో ఎన్టీఆర్ ఏకంగా మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి ఇంట్లోనే ఉండి డబ్బింగ్ చెబుతూనే..
మరోపక్క మలయాళం లాంగ్వేజ్ లో శిక్షణ తీసుకుంటూ ఉంటున్నాడట. అంతే కాదు మలయాళం క్లాస్ లు వినడంతో పాటు… డబ్బింగ్ క్లాస్ లు కూడా విని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట.అంటే… ‘ఆర్.ఆర్.ఆర్’ మలయాళ వెర్షన్ కు కూడా తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ ధ్యేయం అయ్యి ఉంటుంది. ఇక ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియోలో… చరణ్ ను అంత పవర్ ఫుల్ గా పరిచయం చెయ్యడం వెనుక ఎన్టీఆర్ కష్టం కూడా ఉంది.
అనర్గళంగా ఏ భాషలో అయినా మాట్లాడగలడు ఎన్టీఆర్. కన్నడం ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఓ పాట ఎన్టీఆర్ పాడిన సంగతి తెలిసిందే. ప్రతీ భాషలోనూ అతను పట్టు సాధించి ఇండియన్ సూపర్ స్టార్ అవ్వగల కెపాసిటీ ఎన్టీఆర్ కు ఉందని దర్శకుడు రాజమౌళి ఎంతో ధీమాగా చెబుతున్నారు. ఏమైనా లాక్ డౌన్ టైం ను ఎన్టీఆర్ ఉపయోగించుకుంటున్న తీరు చాలా ముచ్చటగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.