Natu Natu Song: నాటు-నాటు డ్యాన్స్ వెనుక సీక్రెట్స్ చెప్పుకొచ్చిన తారక్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ మరో 44 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది. చరణ్ ఎన్టీఆర్ కలిసి వేసిన ఫుట్ స్టెప్ వైరల్ కాగా ఆ డ్యాన్స్ మూమెంట్ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పాటకు ఇప్పటికే 26 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

షూటింగ్ స్టేజ్ లో నాటు నాటు డ్యాన్స్ మూమెంట్ పై తనకు పెద్దగా అంచనాలు లేవని తారక్ అన్నారు. ఈ పాట కోసం టేకుల మీద టేకులు తీసుకోవాల్సి వచ్చిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. నాటు నాటు సాంగ్ కోసం తన కాళ్లు, చరణ్ కాళ్లు పర్ఫెక్ట్ టైమింగ్ తో కదలాలని రాజమౌళి ఆ పాట విషయంలో నచ్చకపోతే రీ టేక్ అనేవారని అలా రాజమౌళి పట్టుబట్టడానికి అసలు కారణం ఇప్పుడు అర్థమైందని ఎన్టీఆర్ తెలిపారు.

నాటు నాటు స్టెప్ కోసం ఏకంగా 15 నుంచి 18 టేకులు తీసుకున్నామని తారక్ తెలిపారు. పాట రిలీజైన తర్వాత పడ్డ కష్టం అంతా మరిచిపోయామని ఎన్టీఆర్ తెలిపారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా, 2022 సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతాయని ఎన్టీఆర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus