Jr NTR, Pawan Kalyan: టాలీవుడ్ హీరోల పాలిట లక్ గా మారిన పవన్, ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

  • October 10, 2023 / 06:08 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరోల సినిమాలను సపోర్ట్ చేసే విషయంలో ఈ హీరోలు ముందువరసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ అరుదుగా మాత్రమే ఇతర హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరవుతూ ఉంటారు. నితిన్ సినిమాల ఈవెంట్లు ఎక్కువగా పవన్ హాజరు కావడం జరిగింది. ఆ సమయంలో నితిన్ కు వరుస విజయాలు దక్కాయి.

చరణ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పవన్ హాజరైన సమయంలో కూడా విజయాలు దక్కాయి. ఒక విధంగా పవన్ కళ్యాణ్ హాజరైతే సినిమా హిట్ అని భావన ఇండస్ట్రీలో ఉంది. రిపబ్లిక్, చల్ మోహన్ రంగా సినిమాలు మినహా పవన్ గెస్ట్ గా హాజరైన సినిమాలన్నీ కమర్షియల్ లెక్కల ప్రకారం సక్సెస్ సాధించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుండటం గమనార్హం.

గడిచిన 14 నెలల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ బింబిసార, అమిగోస్, దాస్ కా ధమ్కీ ఈ వెంట్లకు హాజరు కాగా ఈ సినిమాలలో బింబిసార, దాస్ కా ధమ్కీ సక్సెస్ సాధించాయి. ఎన్టీఆర్ చేతుల మీదుగా మ్యాడ్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తోంది.

మ్యాడ్ సినిమా రిజల్ట్ విషయంలో సితార నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. పవన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోల పాలిట లక్ గా మారారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus