Jr NTR: ఎమోషన్స్ ను నమ్ముకుంటున్న యంగ్ టైగర్!

  • August 8, 2021 / 03:55 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో సీజన్ 1 తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ చేసే అవకాశం వచ్చినా వదులుకున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు హోస్ట్ గా చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ షో ప్రసారం కానుండగా ఇప్పటివరకు రిలీజైన ప్రోమోలను పరిశీలిస్తే ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు అర్థమవుతోంది.

ఎవరు మీలో కోటీశ్వరుడు షో వచ్చే వారం నుంచి ప్రసారం కానుందని వార్తలు వస్తుండగా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షోలో కూడా ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. స్టార్ మా ఛానెల్ లో ఈ షో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ప్రసారం కాగా నాగార్జున హోస్ట్ గా మెప్పించారు. నాగార్జునను మించి మెప్పించాల్సిన బాధ్యత ఎన్టీఆర్ పై ఉండగా ఎన్టీఆర్ హోస్ట్ గా ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని భోగట్టా. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఅర్ నటించిన మరో సినిమా రిలీజ్ కాకపోయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఆ లోటును తీరుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఎవరు మీలో కోటీశ్వరుడు షో చేస్తున్న ఎన్టీఆర్ ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus