ఏదైనా….అభిమానుల కోసమే!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటేనే మాస్ గుండెల్లో అభిమానం ఉప్పొంగుతుంధీ. సక్సెస్ ఫేల్యూవర్స్ విషయాన్ని పక్కన పెడితే మాస్ హీరోగా ఎన్టీఆర్ చరిష్మా మరే హీరోకు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే నాన్నకు ప్రేమతో సినిమాతో 50కోట్ల క్లబ్ లోకి చేరిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చేస్తున్న విషయం యావత్ ప్రపంచానికి ఎరుక.

అయితే అసలే అభిమానులంటే ఎన్టీఆర్ కు పిచ్చి, సహజంగా చెప్పాలి అంటే అందరి హీరోలకి అభిమానులుంటే, ఎన్టీఆర్ కు మాత్రం భక్తులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా రిజల్ట్ తో సంభంధం లేకుండా…ఎన్టీఆర్ ను ఎల్లప్పుడు అభిమానిస్తూ ఎన్టీఆర్ కు వెన్నంటే ఉంటూ వస్తున్నారు. ఇక అలాంటి అభిమానుల కోసం ఎన్టీఆర్ త్వరలో సరికొత్త బహుమతి ఒకటి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎంతా గిఫ్ట్ అంటారా…అయితే ఈ మ్యాటర్ చదవాల్సిందే…

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా మొత్తం కంప్లీట్ అయితేనే కాని పోస్టర్ రిలీజ్ చేయని ఈ సందర్భంలో… ఎన్టీఆర్ తన అభిమానులకు సర్ప్రైస్ ఇచ్చేందుకు …సినిమా అవుతున్నది అవుతున్నట్టుగా ఎడిటింగ్ చేయించి కేవలం ఫ్యాన్స్ కోసమే నెలకో పోస్టర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అని టాక్.

అందులో భాగంగానే, ఫస్ట్ లుక్ పోస్టర్ ఏప్రిల్ 25న అభిమానుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఆ తర్వాత అదే పద్దతిని కొనసాగిస్తూ…ఫ్యాన్స్ కోసం ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలా నెలకో పోస్టర్ రిలీజ్ చేసి ఆగష్టు 12న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక శ్రీమంతుడు భారీ హిట్ తర్వాత కొరటాల శివ చేస్తున్న  సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus