టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా రానిస్తోంది. 2024లో పుష్ప 2 తో (Pushpa 2) ఊహించినదానికంటే పెద్ద హిట్ సాధించిన మైత్రీ, ఇప్పటికే తమ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మైత్రీ, 2025లో హ్యాట్రిక్ హిట్స్‌తో చరిత్ర సృష్టించాలనే ఆలోచనలో ఉంది. ఇక 2026ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తూ రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ ఒక్క ఏడాది లోనే ఈ సంస్థ 2 వేల కోట్లకు పైనే బిజినెస్ చేయనుంది.
2026 సంక్రాంతి పండుగ కోసం ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేశారు. KGF సలార్ (Salaar) సినిమాలతో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఇమేజ్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే, సంక్రాంతి బరిలో మైత్రీకు గెలుపు ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను 2026 జనవరి 9 విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది పక్కా వెయ్యి కోట్ల బొమ్మ అని చెప్పవచ్చు.
ఇక 2026 చివరి భాగం కోసం మరో భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది మైత్రీ. సీతారామం (Sita Ramam) ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీని క్రిస్మస్ కానుకగా లేదా దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో సాగే ఈ కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇక ఇది కూడా వెయ్యి కోట్ల బొమ్మే అవుతుంది. కంటెంట్ క్లిక్కయితే 1500 కోట్ల మార్కెట్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ రెండు సినిమాలపై ఇప్పటి నుంచే ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరూ తమ కెరీర్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ బ్యాంకబుల్ స్టార్స్ కావడంతో, ఈ ప్రాజెక్టులు మైత్రీ బ్యానర్‌కు మరో రేంజ్ లో నిలబెడతాయని చెప్పవచ్చు. మైత్రీ ప్లాన్ ప్రకారం 2026లో బిగ్గెస్ట్ రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది. రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్నాయి.