Mass Jathara: రవితేజ మాస్ జాతర.. అసలు సౌండ్ లేకపోతే ఎలా?

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన అభిమానుల కోసం మరోసారి మాస్ ఎంటర్టైనర్‌తో రావడానికి సిద్ధమయ్యాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రవితేజ మాస్ ఎనర్జీని పూర్తిగా క్యాష్ చేసుకునేలా ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు సమాచారం. ‘సామజవరగమన’తో (Samajavaragamana) మంచి గుర్తింపు తెచ్చుకున్న రైటర్ భాను భోగవరపు, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ధమాకా (Dhamaka) తర్వాత రవితేజకు బాక్సాఫీస్ వద్ద హిట్ అవసరం చాలా ఉంది.

Mass Jathara

గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ఆయన సాలీడ్ స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమాలో రవితేజ, శ్రీలీల జోడీగా నటిస్తున్నారు. ‘ధమాకా’లో ఈ జోడీకి భారీ ఆదరణ లభించింది. అదే కాంబో ఈ సినిమాలోనూ రిపీట్ కావడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ‘మాస్ జాతర’లో కూడా అలాంటి మాస్ ఫన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రవితేజ ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించాలని మొదట అనుకున్నారు.

కానీ షూటింగ్ సమయంలో రవితేజ గాయపడటంతో చిత్ర నిర్మాణం ఆలస్యమైంది. ఈ కారణంగా సినిమా విడుదల సమయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లోనైనా సినిమా విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం. గత ఏడాది రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) సినిమా అభిమానులను నిరాశపరిచింది. అందుకే ఈసారి మంచి కథ, మాస్ అప్‌పీల్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో ‘మాస్ జాతర’పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం అభిమానుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది. మార్కెట్ లో బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని తెలుస్తోంది. ఈపాటికి నాన్ థియేట్రికల్ డీల్స్ అన్ని ఫినిష్ అవ్వాలి. కానీ బజ్ లేని కారణంగా ఇంకా బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని టాక్. మంచి బజ్ క్రియేట్ చేస్తేనే మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. సంక్రాంతికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.

అకీరా నందన్‌ ఎంట్రీ ఎప్పుడు? ఫ్యాన్స్‌కి సమాధానం ఇవ్వాల్సిందే ఆయనేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus