నటి హనీ రోజ్ (Honey Rose) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా నటించింది. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో కూడా కనిపించింది. ఆమె సౌత్ ఇండియాలో చాలా పాపులర్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె సంచలన ఆరోపణలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఎవరో ఒక వ్యక్తి తనని వెంటాడుతూ, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నాడని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు ఉందని ఎవరినైనా ఏమైనా అనొచ్చా అంటూ ఆమె ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
హనీ రోజ్ (Honey Rose) చెప్పిన దాని ప్రకారం, మొదట ఆ వ్యక్తి ఆమెను ఒక ఈవెంట్‌కి అతిథిగా పిలిచాడు. ఆమె వెళ్లడానికి ఒప్పుకుంది. అయితే, ఆ తర్వాత అతను మళ్లీ రావాలంటూ అనేక ఆహ్వానాలు పంపించగా ఆమె తిరస్కరించింది. దీనితో ఆగ్రహించిన ఆ వ్యక్తి, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపిస్తోంది.
హనీ రోజ్ (Honey Rose) ఎంతో ఆవేదనతో తన బాధను పంచుకుంది. ఆ వ్యక్తి తనని కావాలనే అవమానించేలా ప్రవర్తిస్తున్నాడని, తాను ఎక్కడికి వెళ్లినా అక్కడికి వచ్చి తనని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నాడని చెప్పింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా తన గురించి తప్పుగా రాస్తూ వస్తున్నట్టు తెలిపింది.ఇలాంటి విషయాల్లో చట్టం ఎందుకు కఠినంగా ఉండట్లేదని హనీ రోజ్ (Honey Rose) ప్రశ్నించింది.
‘ఆడవాళ్లని ఇలా వేధిస్తుంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా?’ అని నిలదీసింది. ‘వెంటపడటం, అసభ్యంగా మాట్లాడటం నేరమని అందరికీ తెలుసు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని’ ఆమె అడుగుతోంది.ఇన్నాళ్లూ ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా వదిలేశానని, కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండలేనని హనీ రోజ్ గట్టిగా చెప్పింది. తన బాధను అందరితో పంచుకోవాలని నిర్ణయించుకుంది. బాధితులందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చింది.హనీ రోజ్ తనలాంటి బాధితులందరి కోసం గట్టిగా పోరాడతాను అనడాన్ని మెచ్చుకోవాల్సిందే.