జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సలార్2 సినిమా వల్ల ఈ సినిమా ఆలస్యం కానుందని ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తారక్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగష్టు నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఆగష్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైతే 2026 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. దేవర (Devara) ఫస్ట్ సింగిల్ వచ్చిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు ఈ తీపికబురు మరింత ఆనందాన్ని కలిగించింది. ప్రశాంత్ నీల్ సలార్2 సినిమాకు సంబంధించి వరదరాజమన్నార్, సలార్ (Salaar) చిన్నప్పటి పాత్రల సన్నివేశాలను షూట్ చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారని భోగట్టా.
ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తారక్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తారక్ పాత్రను ఒకింత వయొలెంట్ గా ప్రశాంత్ నీల్ చూపించనున్నారని భోగట్టా. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ పారితోషికాలకే సినిమా బడ్జెట్ లో సగం ఖర్చు కానుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా డార్క్ షేడ్స్ లో షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఇండస్ట్రీలోని బెస్ట్ కాంబినేషన్లలో ఒకటి అవుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.