Jr NTR: తారక్ వాళ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు. ఇండస్ట్రీలో ఎక్కువమంది స్నేహితులు ఉన్న స్టార్ హీరోలలో తారక్ ఒకరు. తారక్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తారని ఆయన అభిమానులు భావిస్తారు. ఎన్టీఆర్ గతంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి పార్టీలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం తారక్ ఫ్రెండ్స్ కంటే ఫ్యామిలీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది.

బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కు అండగా నిలవాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కు కచ్చితంగా సక్సెస్ దక్కాలని తారక్ కోరుకుంటున్నారు. ఈ నెల 29వ తేదీన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. బింబిసార సినిమాకు పోటీగా సీతారామం రిలీజ్ అవుతుండగా సీతారామం నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులు అనే సంగతి తెలిసిందే.

అశ్వనీదత్ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్లే గతంలో తారక్ మహానటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అశ్వనీదత్ కూతుళ్లు స్నేహితురాళ్లు అయినా తారక్ బింబిసారనే సపోర్ట్ చేస్తున్నారు. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ కానుండటంతో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

బింబిసార సినిమాను ఇప్పటికే చూసిన తారక్ ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కు భారీ సక్సెస్ ఖాయమని నమ్ముతున్నారు. అటు బింబిసార ఇటు సీతారామం ట్రైలర్లు ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus