Jr NTR: ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై స్పందించిన ఎన్టీఆర్..ట్వీట్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు పట్ల ఎంతోమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైయస్సార్ పేరు పెట్టడంపై ఏపీ అసెంబ్లీ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంపై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ పూర్తిగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై నటుడు, నందమూరి వారసులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ..

ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ఆదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఈ యూనివర్సిటీకి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపి వేయలేరు అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

1986వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.అయితే అప్పటినుంచి ఈ విశ్వవిద్యాలయానికి ఇదే పేరు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి వైయస్సార్ పేరుని పెట్టడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఈ నిర్ణయం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వైయస్సార్ పేరు తొలగించి ఎన్టీఆర్ పెట్టాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus