రామ్ చరణ్ కూతురు కోసం ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్ పంపించారో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన పెళ్లైన 11 సంవత్సరాలకు పండంటి పాపాయికి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. 11 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కావడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఉపాసన గత నెల 20వ తేదీ పాపాయికి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ చిన్నారికి క్లీన్ కారా అని నామకరణం కూడా చేశారు.

ఇకపోతే ఇప్పటివరకు రామ్ చరణ్ ఉపాసన తమ చిన్నారిని అభిమానులకు చూపించలేదు అయితే పలువురు సెలబ్రిటీలు మాత్రం మెగా ప్రిన్సెస్ చూడటం కోసం వెళ్తున్నారట అలాగే మరికొందరు ఈమె కోసం ప్రత్యేకంగా గిఫ్ట్స్ పంపిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ కుమార్ కోసం ప్రత్యేకంగా గిఫ్ట్స్ పంపించారని తెలుస్తోంది. రామ్ చరణ్ కూతురి కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఒక లాకెట్ పంపించారట,

అయితే ఇందులో రామ్ చరణ్ ఉపాసన పేర్లతో పాటు క్లీన్ కారా పేరు ఉన్నటువంటి ఒక గోల్డ్ లాకెట్ డిజైన్ చేయించారని తెలుస్తుంది. అలాగే మరికొన్ని టాయ్స్ కూడా కానుకగా పంపించారని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ మాత్రమే కాకుండా తన కుమారులు కూడా క్లీన్ కారా కోసం కొన్ని స్పెషల్ గిఫ్ట్ పంపించారట. ఉపాసన కుమార్తె క్లీన్ కార కోసం ఎన్టీఆర్ కుమారులు వారు వేసినటువంటి కొన్ని డ్రాయింగ్స్ తనకు కానుకగా పంపించారని తెలుస్తోంది.

ఇలా ఎన్టీఆర్ అలాగే తన కుమారులు రామ్ చరణ్ కూతురి కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్ పంపించడంతో ఉపాసన రాంచరణ్ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉపాసన ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారట.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus