సినిమాల్లో సక్సెస్ కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అలా చేయాలనుకున్నారా?

  • May 22, 2023 / 07:14 AM IST

సినిమాల కోసం పని చేసే ప్రతి హీరోకు సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది. అయితే కొంతమంది హీరోలు మాత్రం సినిమాల కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కోసం అలా ప్రాణం పెట్టే హీరోలలో తారక్ ముందువరసలో ఉంటారు. అయితే ఒక ఇంటర్వ్యూలో తారక్ తాను హీరోగా సక్సెస్ కాకపోయినా సినిమాల్లోనే ఏదో ఒక చిన్న పని చేస్తూ అయినా కొనసాగుతానని వెల్లడించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

సినిమాలంటే ఇంత అభిమానం ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. తారక్ ప్రశాంత్ కాంబో మూవీ వచ్చే ఏడాది మార్చి నెల నుంచి మొదలుకానుందని సమాచారం అందుతోంది. అధికారికంగా ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో, పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్నారు.

వార్2 సినిమాలో తారక్ నటిస్తున్నట్టు హృతిక్ రోషన్ ట్వీట్ ద్వారా స్పష్టత వచ్చేసింది. హృతిక్ రోషన్ తారక్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులతో పాటు యూత్ లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ నెగిటివిటీని పట్టించుకోకుండా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus