Jr NTR: ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అట..!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో తారక్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు లభించింది. తారక్ తర్వాత సినిమాలపై కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కొరటాల శివ తో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ చేయాల్సి ఉంది.’జనతా గ్యారేజ్’ తర్వాత వీరి కాంబో మళ్ళీ సెట్ అయ్యింది. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇందుకు ప్రధాన కారణం ఎన్టీఆర్ షోల్డర్ సమస్యతో బాధ పడుతుండడం అని టాక్ నడుస్తుంది.

‘బింబిసార’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. ఆ టైంకి కూడా తారక్ ను ఈ సమస్య వేధిస్తోందని టాక్ వినిపించింది. ‘నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని తారక్ కు వైద్యులు సూచనలు చేశారని.’ ప్రచారం నడుస్తోంది. అందుకే కొరటాల శివ సినిమా ఆలస్యం అవుతుందని అంతా గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సన్నిహితులు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ‘జూ.ఎన్టీఆర్ అనారోగ్యంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

భుజం నొప్పితో బాధపడుతున్నాడని, 4 వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. కుటుంబంతో కలిసి ఆయన హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తర్వాతి సినిమా కొరటాల శివతో అతి త్వరలో ప్రారంభం కాబోతుంది’ అంటూ స్పష్టం చేశారు. ఇలా ఎన్టీఆర్ సన్నిహితులు క్లారిటీ ఇవ్వడం వలన… అతని అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus