అరెరే ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద సమస్యే వచ్చి పడిందే

  • January 6, 2020 / 09:04 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’. టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లు సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. తారక్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కి సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో తారక్ గుండుతో కనిపించనున్నారట. తారక్ ని జుట్టు లేకుండా చూసి ఫ్యాన్స్ తట్టుకోగలరా..? అనేది ప్రశ్న. ఇది రూమర్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. న్యూఇయర్ రోజున ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు కానీ లేకపోవడంతో హర్ట్ అయ్యారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను రూ.400 కోట్లతో నిర్మించనున్నారు. ఎంఎం కీరవాణి సినిమాకు సంగీతం అందించనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ ముద్దుగుమ్న ఒలివియా మోరీస్ కనిపించనుంది. ఈ ఏడాది జులై 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus