రేటింగ్ పెంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న షో నిర్వాహకులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ వన్ రియాలిటీ షో సంచలనం సృష్టించింది. అందుకు కొనసాగింపుగా బిగ్ బాస్ సీజన్ 2 ఈ నెల 10న ప్రారంభమై బాగానే ఆకట్టుకుంటోంది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. అసలే ఎన్టీఆర్ సమయంలో వచ్చిన టీఆర్పీ రావడం లేదని బాధపడుతుంటే.. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన వారిపై బిగ్ బాస్ వేటు వేయడంతో ప్రేక్షకులు కోపంగా ఉన్నారు. దీంతో ఈ వారం రేటింగ్ మరింత తగ్గే అవకాశం ఉంది. అందుకే షో నిర్వాహకులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ షోకి ఎన్టీఆర్ ని గెస్ట్ గా ఆహ్వానించారు.

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. స్టార్ మా వాళ్ళు అడిగేసరికి కాదనలేకపోయారు. త్వరలోనే డేట్ కేటాయించనున్నట్లు తెలిసింది. “ఏదైనా జరగొచ్చు” అనే క్యాప్చన్ తో షో మొదలయింది. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ సడన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఒక రోజు హౌస్ లోకి వెళతారా? లేకుంటే.. స్టేజీ పైనే మాటలతో అదరగొడుతారా? అనేది ఇంకా తెలియదు. అలాగే మరికొంతమంది స్టార్స్ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి పార్టిసిపెంట్స్ గా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు కృష్ణా నగర్ వాసులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus