Jr NTR: ‘నిన్ను చూడాలని’ టు ‘ఆర్.ఆర్.ఆర్’… ఎన్టీఆర్ మూవీస్ కలెక్షన్స్ లిస్ట్..!

  • May 19, 2022 / 01:48 PM IST

దివంగత స్టార్ హీరో,ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుండీ వచ్చిన థర్డ్ జనరేషన్ స్టార్ జూ.ఎన్టీఆర్.హరికృష్ణ గారి చిన్నబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులు ఇతన్ని ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటూ ఉంటారు.గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’ చిత్రంతో నటుడిగా మారాడు. అంతకు ముందు తన తాత గారి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్లో కూడా నటించాడు. అయితే ‘నిన్ను చూడాలని’ చిత్రంతో చాలా సైలెంట్ గా కంప్లీట్ హీరోగా మారాడు.

ఆ తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం ఇతనికి మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రంతో రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేసిన క్రెడిట్ కూడా ఎన్టీఆర్ కే దక్కింది. అటు తర్వాత ‘ఆది’ తో వినాయక్ వంటి మరో స్టార్ దర్శకుడిని టాలీవుడ్ కు పరిచయం చేశాడు ఎన్టీఆర్. ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కు స్టార్ డంని తెచ్చిపెట్టాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో రెండోసారి ఎన్టీఆర్ చేసిన ‘సింహాద్రి’ మూవీ అతన్ని తక్కువ వయసులోనే సూపర్ స్టార్ ను చేసింది.

ఆ తర్వాత ‘యమదొంగ’ ‘అదుర్స్’ ‘బృందావనం’ ‘బాద్ షా’ ‘టెంపర్’ ‘జనతా గ్యారేజ్’ ‘అరవింద సమేత’ వంటి హిట్లని అందుకుని… రాజమౌళి దర్శకత్వంలో మూడోసారి చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ మూవీలో కొమరం భీమ్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇది ఎన్టీఆర్ కెరీర్లో 29 వ చిత్రం. ఇదిలా ఉండగా.. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. కాబట్టి ఆయన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ వరకు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

1) నిన్ను చూడాలని :

ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇది. ‘నువ్వు వస్తావని’ వంటి సూపర్ హిట్ ను అందించిన వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. అతి కష్టం మీద ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1.75 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

2) స్టూడెంట్ నెంబర్ 1:

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) సుబ్బు :

ఎన్టీఆర్ హీరోగా సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నా స్టూడెంట్ నెంబర్ 1 తో ఎన్టీఆర్ కు వచ్చిన క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

4) ఆది :

ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.18 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ ఏర్పడింది.

5) అల్లరి రాముడు :

బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.9 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

6) నాగ :

ఎన్టీఆర్ హీరోగా డి.కె.సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ప్లాప్ గా మిగిలింది.

7) సింహాద్రి :

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రెండో మూవీ ఇది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.25.4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

8) ఆంధ్రావాలా :

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల షేర్ ను రాబట్టింది. ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం వలన బయ్యర్స్ భారీగా నష్టపోయారు. దాంతో మూవీ డిజాస్టర్ గా మిగిలింది.

9) సాంబ :

ఎన్టీఆర్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన 2వ సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.13 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది.

10) నా అల్లుడు :

ఎన్టీఆర్ హీరోగా వర ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ప్లాప్ గా మిగిలింది.

11) నరసింహుడు :

ఎన్టీఆర్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.9 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.

12) అశోక్ :

ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ అనిపించుకుంది.

13) రాఖీ :

ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.16 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ అనిపించుకుంది.

14) యమదొంగ :

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.28.80 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది.

15) కంత్రి :

ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.19 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అబౌవ్ యావరేజ్ అనిపించుకుంది.

16) అదుర్స్ :

ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.26.54 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది.

17) బృందావనం :

ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.30.23 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది.

18) ఊసరవెల్లి :

ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.24 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ అనిపించుకుంది.

19) శక్తి :

ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.19 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డబుల్ డిజాస్టర్ గా మిగిలింది.

20) దమ్ము :

ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.32 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ అనిపించుకుంది.

21) బాద్ షా :

ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.46 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అబౌవ్ యావరేజ్ అనిపించుకుంది.

22) రామయ్యా వస్తావయ్యా :

ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ప్లాప్ గా మిగిలింది.

23) రభస :

ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.

24) టెంపర్ :

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.43 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది.

25) నాన్నకు ప్రేమతో :

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.53 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అబౌవ్ యావరేజ్ అనిపించుకుంది.

26) జనతా గ్యారేజ్ :

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.81 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది.

27) జై లవ కుశ :

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ అనిపించుకుంది.

28) అరవింద సమేత :

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.89.04 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అబౌవ్ యావరేజ్ గా మిగిలింది.

29) ఆర్.ఆర్.ఆర్ :

ఎన్టీఆర్-రాంచరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.607 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus