ఎన్టీఆర్ vs రామ్‌చరణ్: ఎవరి ఆస్తులెంత, ఇద్దరిలో ఎవరి ఆదాయం ఎక్కువ..?

తెలుగు చిత్ర పరిశ్రమలో భిన్న ధ్రువాలుగా, ప్రత్యర్ధులుగా పేరొందిన మెగా- నందమూరి కుటుంబాలను ఒక్కతాటిపైకి తీసుకొస్తూ… దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సెల్యూలాయిడ్‌ పై ఆవిష్కరించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా- నందమూరి వారసులైన రాంచరణ్, ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో కలిసి నటించారు. వీరిద్దరూ ఎప్పటి నుండో మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో తమ మైత్రి బంధాన్ని తెరపై కూడా అద్భుతంగా చూపించారు.

జక్కన్న టేకింగ్, ఎన్టీఆర్, చరణ్‌ ల నటనతో ఆర్ఆర్ఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.అందుకే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురుస్తుంది. అతి త్వరలో రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేయబోతుంది ఈ మూవీ. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి… లాంగ్ రన్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడును ఆపడం కష్టమేనని ట్రేడ్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే.. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వ్యక్తిగత జీవితం, ఆస్తులు, ఆదాయం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను అభిమానులు వంటి విషయాలు ఎప్పుడూ చర్చల్లో ఉంటాయి.వీళ్ళ అభిమానులకి కూడా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.వీరిలో ఎవరు ఏ విషయంలో టాప్ వున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి లైఫ్‌స్టైల్‌ను ఒకసారి పరిశీలిస్తే..

1) లగ్జరీ కార్లు: మన తెలుగు హీరోలకు కార్లంటే ఎంతో మోజు. అందుకే మార్కెట్‌లో ఏ కొత్త మోడల్ లాంచైనా ముందుగా హీరోలే దాన్ని కొనుగోలు చేస్తుంటారు.

2) టాలీవుడ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. కొత్తగా ఏదైనా మోడల్ కారు వచ్చిందంటే తారక్ గ్యారేజ్‌లోకి చేరాల్సిందే. గతేడాది ఎన్టీఆర్ ‘లంబోర్ఘిని’ యూరుస్ గ్రాఫైట్ మోడల్ కారును ఆర్డర్ చేసారు. అంతేకాదు మన దేశంలో ఈ కారును కొన్న తొలి వ్యక్తిగా జూనియర్ నిలిచారు. దీని ఖరీదు అక్షరాల 3.16 కోట్లు. దీనితో పాటు ఆయన వద్ద మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ, రేంజ్ రోవర్ వోగ్యూ ఎస్‌యూవీలు కూడా వున్నాయి. అలాగే పోర్షే 718 కేమ్యాన్‌ను 85.95 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ ఎక్కువగా వినియోగించే కారు బీఎండబ్ల్యూ ఎల్‌డీ.. దీని ధర 1.32 కోట్లు. దీనిని స్వయంగా ఎన్టీఆరే నడుపుతున్నారు.

3) ఇక చరణ్ విషయానికి వస్తే.. ఆస్టన్ మార్టిన్ వాంటేజ్‌ కారును ఆయన వినియోగిస్తారు. దీనిని ఆయన తండ్రి చిరంజీవి చరణ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనితో పాటు ఆయన వద్ద మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్‌యూవీ వుంది. దీని ధర రూ.80 లక్షలు. ఇకపోతే.. చరణ్ గ్యారేజ్‌లో 3.34 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్, 3.5 కోట్ల రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వున్నాయి.

4) యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ వుందని సమాచారం. దీనిని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పార్క్ చేసి ఉంచుతారు.

5) రాంచరణ్ విషయానికి వస్తే.. ఆయనకు స్వయంగా ట్రూజెట్ పేరిట సొంతంగా ఎయిర్‌లైన్ కంపెనీ వుంది.

6) జూనియర్ ఎన్టీఆర్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన భవనం వుంది.

7) ఇక రామ్‌చరణ్, చిరంజీవీలు ఎన్టీఆర్‌ కు పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు.వీళ్లకు కూడా విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

8) అలాగే జూనియర్‌కు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటకలలోనూ విలాసవంతమైన భవనాలు వున్నాయి.

9) రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లో ఇటీవల ఇల్లు కొనుక్కున్నారు. దీని విలువ అక్షరాలా రూ.30 కోట్లు ఉంటుందని అంచనా.

10) జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తుల విలువ రూ.444 కోట్లు ఉంటుందని అంచనా.

11) చరణ్ విషయానికి వస్తే ఆయన ఆస్తుల విలువ రూ.1300 కోట్లు ఉంటుందని అంచనా.

12) ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే…జూనియర్ ఎన్టీఆర్ గుంటూరు సమీపంలోని విజ్ఞాన్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.

13) రాంచరణ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని సెయింట్ మేరిస్ కాలేజ్ నుంచి బీకామ్ చదివారు.

14) వీరిద్దరికీ ఉన్న ఓ కామన్ పాయింట్ ఏంటంటే.. రాజమౌళి దర్శకత్వంలోనే ఇద్దరూ కూడా మొదటి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

15) ఇద్దరికీ బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ… కొన్ని కారణాల వల్ల మెయింటైన్ చేయలేకపోతున్నారు. అయితే చరణ్ కు మాత్రం రెండు గుర్రాలు ఉన్నాయి. పారితోషికాల విషయంలో ఇద్దరూ సమానమే. కాకపోతే యాడ్స్ రూపంలో ఎన్టీఆర్ కొంత ఎక్కువ సంపాదిస్తున్నారు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus