Devara: ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఖాయం ‘దేవర’..!

  • September 27, 2024 / 11:21 AM IST

6 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) సోలో హీరోగా రూపొందిన మూవీ ‘దేవర’ (Devara) . కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ ఇది. వర, దేవర.. అనే 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. హిట్టు కాంబినేషన్ కాబట్టి ‘దేవర’ పై మంచి అంచనాలే ఉన్నాయి. ‘చుట్టమల్లె’ సాంగ్ కూడా బాగా వైరల్ అయ్యింది. రిలీజ్ ట్రైలర్ అందరికీ హాప్ ఇచ్చింది. అన్నీ ఎలా ఉన్నా..

Devara

‘కల్కి 2898 ad’ తర్వాత పెద్ద సినిమా ఏమీ రాలేదు. కాబట్టి.. ‘దేవర’ (Devara) పై అందరి దృష్టి పడింది. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా మంచి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 27 పాన్ ఇండియా సినిమాలకి మంచి రిలీజ్ డేట్. మరోపక్క ‘దేవర’ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఆల్ టైం రికార్డులు సృష్టిస్తుంది.

అర్ధరాత్రి షోలకి కూడా అనుమతి లభించడంతో.. ఎక్కువ షోలు పడుతున్నాయి. అందువల్ల మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న ట్రెండ్ ను బట్టి చూస్తే.. ‘దేవర’ (Devara) మొదటి రోజు రూ.90 కోట్ల నుండి రూ.100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సీడెడ్లో రికార్డు కొట్టే ఛాన్స్ ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. దసరా సెలవలు ముగిసేవరకు ‘దేవర’ కి స్ట్రాంగ్ బాక్సాఫీస్ రన్ ఉండొచ్చు.

‘దేవర’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus