War2 Movie: వార్2 మూవీలో నటించే లక్కీ ఛాన్స్ ఈ ఇద్దరు హీరోయిన్లకు దక్కిందా?

  • November 14, 2023 / 06:08 PM IST

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వార్2 సినిమాకు సంబంధించి టైగర్3 మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ తో షాకింగ్ అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వార్2 సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. వార్2 మూవీలో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో కనిపించనుండగా జూనియర్ ఎన్టీఆర్ నజీర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రల కోసం దీపికా పదుకొనే, అలియా భట్ లను సంప్రదించారని తెలుస్తోంది.

ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాలో నటించడానికి ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, అలియా భట్ కాంబినేషన్ లో కొన్ని నెలల క్రితం దేవర మూవీ తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. అలియా భట్ గర్భవతి కావడంతో దేవర మూవీ నుంచి తప్పుకోవడం జరిగింది. అయితే ఎన్టీఆర్ అలియా భట్ కాంబినేషన్ లో వార్2 సినిమా వస్తే మాత్రం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వార్2 సినిమా కోసం తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా ఈ సినిమాలో తారక్ లుక్ సైతం కొత్తగా ఉండనుందని సమాచారం అందుతోంది. వార్2 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. వార్2 మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా (War2 Movie) ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో సీన్లు అదుర్స్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా కోసం 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో సైతం నటించాలని ఫ్యాన్స్ ఆకాంక్ష కాగా రాబోయే రోజుల్లో ఆ కోరిక కూడా తీరుతుందేమో చూడాల్సి ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus