అవును తమిళ హీరోతో డేటింగ్ లో ఉన్నాను : గుత్తా జ్వాలా

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ హీరోతో డేటింగ్ లో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అతను మరెవరో కాదు తమిళంలో ‘రాట్ససన్’ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న విష్ణు విశాల్. ఈయన గతంలో అంటే.. 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కూతురు రజినీ ని వివాహం చేసుకున్నాడు. అయితే అభిప్రాయబేధాలు రావడంతో 2018 లో విడాకులు తీసుకున్నారు.ఇక గుత్తా జ్వాలా కూడా 2005 లో తన తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తరువాత వీళ్ళు కూడా 2011 లో విడిపోయారు.

Jwala Gutta conforms she dating that hero1

ఇక చాలా రోజుల నుండీ వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ.. ఈమె ఏ ఇంటర్వ్యూలోనూ స్పందించలేదు.అది నా పర్సనల్ మ్యాటర్ అని తేల్చి చెప్పేది. కానీ ఈసారి మాత్రం మేము డేటింగ్ లో ఉన్నాం అని ఓపెన్ గా చెప్పేసింది. పెళ్ళెప్పుడు అని అడిగిన ప్రశ్నకు…’ఇంకా డిసైడ్ చేసుకోలేదు కానీ త్వరలోనే ఒకటవుతాం… మా పెళ్ళికి అందరినీ ఆహ్వానిస్తాం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో నితిన్ తో ఓ పాటకి చిందులేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు నితిన్ కు కూడా ఈమె మంచి ఫ్రెండ్.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus