తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందడంతోపాటు అందరు స్టార్ హీరోలతోనూ కలిసి నటించిన కథానాయిక జ్యోతిక. అనంతరం సూర్యను ప్రేమించి వివాహమాడి సినిమాలకు దాదాపుగా దూరమయ్యింది. మళ్ళీ కొన్నాళ్ళకు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ “36” వయదినిలే” అనే చిత్రంలో నటించినప్పటికీ.. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. దాంతో.. రీఎంట్రీలోనూ ఓ మాంచి హిట్ తన ఖాతాలో ఉండాలనే ఆశతో బ్రహ్మ దర్శకత్వంలో “మగలిర్ మట్టుమ్” అనే డిఫరెంట్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో జ్యోతిక డాక్యుమెంటరీ జర్నలిస్ట్ గా నటిస్తోంది.
అయితే.. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు ఆడాలంటే కంటెంట్ తోపాటు స్టార్ కటౌట్స్ కంపల్సరీ. అందుకే జ్యోతిక భర్త సూపర్ స్టార్ సూర్య నడుం బిగించి, తన భార్య కోసం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేసేందుకు ముందుకొచ్చాడు. సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భానుప్రియ, ఊర్వశీలు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2016 చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా జ్యోతికకు కథానాయికగా పూర్వ వైభవం లభిస్తుందో లేదో చూడాలి!