K Raghavendra Rao: దర్శకేంద్రుడి సినిమాల్లో మొదటి పండు పడింది ఆ హీరోయిన్ పైనే..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారు తెరకెక్కించే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఎక్కువ బ్లాక్ బస్టర్ లు అందించిన దర్శకుల లిస్ట్ లో ఈయన పేరు కూడా ఉంటుంది. ఈ తెరకెక్కించే సినిమా ఏదైనా చాల కలర్ ఫుల్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు.అదిరిపోయే పాటలు.. వాటిల్లో హీరోయిన్ అందాలు చూడాలంటే రాఘవేంద్ర రావు గారి సినిమాల్లో మాత్రమే సాధ్యం.

మరీముఖ్యంగా ఈయన సినిమాల్లో హీరోయిన్ల పై పండ్లు వేస్తూ ఉంటారు. అంతేకాదు హీరోయిన్ లో ఇంత అంతం దాగుందా అనే విధంగా రాఘవేంద్ర రావు గారు పాటలను చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే ఈయన మొదటి పండు ఏ హీరోయిన్ పై వేసారో తెలుసా? లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పై వేశారు. చిరంజీవి,విజయశాంతి,సుహాసిని కాంబినేషన్లో వచ్చిన ‘మంచి దొంగ’ చిత్రాన్ని రాఘవేంద్ర రావు గారు తెరకెక్కించారు. 1988లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ‘బెడ్ లైటు’ అనే పాట ఉంటుంది.

చాలా రొమాంటిక్ గా ఈ పాట సాగుతుంది. ఈ పాటలోనే హీరోయిన్ విజయశాంతి పై మొదటి సారి పండు వేశారు రాఘవేంద్ర రావుగారు. అప్పట్లో ఈ పాట ఓ ఊపు ఊపేసిందనే చెప్పాలి. అత్యంత ఖర్చు పెట్టి చిత్రీకరించిన పాటగా కూడా రికార్డ్ సృష్టించింది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus