వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ సుపరిచితమే.ఒకానొక సమయంలో తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి కాజల్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సినీ కెరియర్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు. పెళ్లి తర్వాత కొద్ది నెలలకే ఈమె ప్రెగ్నెంట్ కావడం అనంతరం నీల్ కిచ్లుకి జన్మనివ్వడంతో ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇలా సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ
సోషల్ మీడియా వేదికగా తన గురించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక తనకు కుమారుడు జన్మించిన తర్వాత తన కుమారుడికి సంబంధించిన విశేషాలను కూడా కాజల్ అభిమానులతో పంచుకుంటున్నారు. కాజల్ ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి భారతీయుడు 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఒకవైపు సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే మరోవైపు కాజల్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ సందర్భంగా కాజల్ తన భర్త గౌతమ్ తో కలిసి దిగినటువంటి ఒక రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలో గౌతమ్ తన కుమారుడు నీల్ ను ఎత్తుకొని ఉండగా కాజల్ మాత్రం తనకు లిప్ లాక్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.