టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కూడా నటిగా చాలా బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓటీటీ రాకతో ఓ పక్క ప్రయోగాలు చేయడానికి అవకాశం దొరికిందని చెబుతూనే.. మరోపక్క ఓటీటీ కారణంగా థియేటర్ వ్యవస్థ నాశనమవుతుంది చెప్పుకొచ్చింది. కరోనా వలన ఫిలిం, టెలివిజన్ ఇండస్ట్రీలు బాగా దెబ తిన్నాయని..
అదే సమయంలో ఓటీటీ వచ్చి టీవీని, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని అధిగమించిందని చెప్పుకొచ్చింది. ప్రజలు తమ ఇంట్లో కూర్చొని కంటెంట్ చూడడానికి అలవాటు పడ్డారని.. ఇది థియేటర్లకు మంచిది కాదని తన అభిప్రాయం తెలియజేసింది. అయితే ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు తాత్కాలికమని అంటోంది. ఎప్పటికైనా ఇండియాలో ఓటీటీపై థియేటర్లదే ఆధిపత్యమని చెబుతోంది. సినిమా థియేటర్ అనుభవం పూర్తిగా కనుమరుగైపోతుందని తను భావించడం లేదని..
అదెప్పుడూ సమాజంలో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో అప్పుడు ప్రేక్షకులు ఓటీటీనీ పక్కన పెడతారని అనుకుంటున్నానని తెలిపింది. అయితే ఓటీటీ కారణంగా సిల్వర్ స్క్రీన్ పై చేయలేని ప్రయోగాలను చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!