Keya Nair: ‘కల్కి 2898 ad’ లో రాయ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో చూడండి..!

  • July 2, 2024 / 12:04 PM IST

ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ కి మైథలాజీని జోడించి డిఫరెంట్ ఫీల్ ను కలిగించాడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా స్టార్టింగ్ లో వచ్చే రాయ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. మొదట ఈమెను చూసి అబ్బాయి అనుకుంటారు. కానీ తర్వాత ఈమె అమ్మాయి అని కాంప్లెక్స్ లోని మానస్ కి తెలిసి ఈమెను హతమార్చడానికి మనుషుల్ని పంపుతాడు.

ఇదే క్రమంలో అశ్వద్ధామ వద్దకి ఈమె వెళ్లడం.. ఈమె దగ్గర ఉన్న శివ మణి… అతనికి అందడం తద్వారా అతని కుష్టు రోగం పోయి శక్తులు పొందడం జరుగుతుంది. రాయ పాత్ర జనాలకి కొంచెం కామెడీని కూడా పంచింది అని చెప్పుకోవచ్చు. సినిమా చివరి వరకు అమితాబ్ (Amitabh Bachchan) పక్కనే ఉంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ పాత్ర. పురాణాలకు సంబంధించిన డౌట్స్ కూడా థియేటర్లలోని కామన్ ఆడియన్స్ లా అడుగుతూ ఉంటుంది.

అయితే ఈ పాత్ర చేసింది కేయ నాయర్ అనే అమ్మాయి. 2021 లో అమితాబ్-కేయ..ల మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రీకరించారట. ఆమె పాత్రకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయి 2 ఏళ్ళు కావడంతో.. ఇప్పుడు ఈమె లుక్ చాలా మారిపోయింది. కేయ నాయర్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus