ప్రభాస్ (Prabhas) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.అంతేకాదు విదేశాల్లో కూడా ప్రభాస్ కూడా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతనితో అవలీలగా రూ.500 కోట్ల బడ్జెట్ సినిమాలు చేయొచ్చు. వాటికి టాక్ బాగుంటే.. రికవరీ చేసే కెపాసిటీ ప్రభాస్ కి ఉంది. ముఖ్యంగా హిందీలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. ‘బాహుబలి’ (Baahubali 2) తర్వాత వచ్చిన ‘సాహో’ (Saaho) సినిమా అక్కడ రూ.125 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను రాబట్టింది.
‘ఆదిపురుష్’ (Adipurush) ‘సలార్’ (Salaar) కూడా అక్కడ బాగా ఆడాయి. ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) తప్ప మిగిలినవన్నీ బాగా ఆడాయి. అయితే మరో 2 వారాల్లో ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రోమోస్ బాగున్నాయి. ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అందులోని విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉన్నాయి. అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమా పై పెద్దగా బజ్ లేదు.
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , దీపికా పదుకోనె (Deepika Padukone) వంటి స్టార్స్ నటించినప్పటికీ.. ఎందుకో అక్కడ ఆశించిన స్థాయిలో హైప్ నమోదు కావడం లేదు. ఏదో ఒక ఈవెంట్ అక్కడ చేస్తే తప్ప ‘కల్కి’ కి నార్త్ లో ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదు అనే కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. తమిళంలో ప్రభాస్ సినిమాలు పెద్దగా కలెక్ట్ చేయడం లేదు. కానీ ఇందులో కమల్ (Kamal Haasan) ఉన్నాడు కాబట్టి.. అక్కడ మంచి బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. దుల్కర్ (Dulquer Salmaan) ఉన్నాడు కాబట్టి మలయాళంలో కూడా కొంతవరకు బాగానే కలెక్ట్ చేయొచ్చు. ఎటొచ్చీ నార్త్ లోనే కష్టంగా ఉంది.