Kalyan Dev: ఆస్పత్రిలో మెగాస్టార్ అల్లుడు.. ఏమైందంటే..?

  • April 22, 2021 / 05:21 PM IST

దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. కళ్యాణ్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మెగా ఫ్యామిలీకి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకడంతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కళ్యాణ్ దేవ్ అన్నారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి కరోనా నుంచి వేగంగా కోలుకునేందుకు చికిత్స చేయించుకుంటున్నానని కళ్యాణ్ దేవ్ తెలిపారు. తాను త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుతున్న వాళ్లందరికీ కళ్యాణ్ దేవ్ ధన్యవాదాలు చెప్పారు. కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్టు గురించి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. గెట్ వెల్ సూన్ మై బాయ్ అంటూ కళ్యాణ్ దేవ్ ను ఉద్దేశించి నాగబాబు కామెంట్ పెట్టారు. మెగా ఫ్యామిలీలో పలువురు ఇప్పటికే కరోనా బారిన పడగా వారి నుంచే కళ్యాణ్ కు కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కళ్యాణ్ దేవ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను కళ్యాణ్ దేవ్ 2016 సంవత్సరం మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. శ్రీజతో పెళ్లి తరువాత విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమా కళ్యాణ్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి అనే సినిమాలో నటిస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus