బంగార్రాజు స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో కళ్యాణ్‌కృష్ణ

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో అక్కినేని నాగార్జున డ్యూయల్ పోషించి ఆకట్టుకున్నారు. ఇందులో బంగార్రాజు పాత్ర తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయింది. ఈ సినిమా విజయం అప్పుడే బంగార్రాజుగా వస్తానని మాట ఇచ్చారు. అయితే స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో వాయిదా  వేసుకుంటూ వచ్చారు. తాజాగా కళ్యాణ్‌ కృష్ణ  స్క్రిప్ట్ ని ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ డైరక్టర్ రవితేజతో నేల టికెట్టు చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇది ఈనెల రిలీజ్ కానుంది. దీని తర్వాత బంగార్రాజు తెరకెక్కించేందుకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం కానున్నారు.  నాగార్జున నటించిన ఆఫీసర్ వచ్చేనెల రిలీజ్ కానుంది. అలాగే డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో  నాని తో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రాన్నీ చేస్తున్నారు. దీని తర్వాత బంగార్రాజు చిత్రం చేయనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే జూన్ 25వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. పూర్తిగా మాస్ మాసాలతో తెరకెక్కే మూవీ ఘనవిజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus