Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

  • February 20, 2026 / 05:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న నందమూరి హీరో మరియు నిర్మాత కళ్యాణ్ రామ్. ఆయన కెరీర్‌లో ‘బింబిసార’ చిత్రం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విభిన్న కథలపై ఆసక్తి చూపే కళ్యాణ్ రామ్, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలోనూ ముందుంటారు. గతంలో ఆయన పరిచయం చేసిన దర్శకులు మంచి హిట్లు అందుకోవడం విశేషం. సురేందర్ రెడ్డి తో ‘అతనొక్కడే’, దర్శకుడు అనిల్ రావిపూడితో ‘పటాస్’ , కె.వి. గుహన్ తో ‘118’ , దర్శకుడు వశిష్ట తో ‘బింబిసార’ వంటి చిత్రాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

Kalyan Ram

2022 విడుదలైన ‘బింబిసార’ పీరియాడిక్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం సాధించింది. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజు కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, సీక్వెల్‌పై భారీ అంచనాలు పెంచింది. అయితే సినిమా వచ్చి నాలుగేళ్లకు దగ్గరవుతున్నా బింబిసార 2పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దీంతో “సీక్వెల్ నిజంగానే ఉంటుందా?” అనే సందేహాలు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి.

ఇటీవల కళ్యాణ్ రామ్ ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడంతో ఈ ప్రశ్నలు మరింత బలపడ్డాయి. తాజా సమాచారం ప్రకారం, బింబిసార 2 విషయంలో టీమ్ ఎలాంటి తొందరపడటం లేదట. పీరియాడిక్ ఫాంటసీ కావడంతో కథ మొదటి భాగాన్ని మించి ఉండాలని, స్క్రిప్ట్ పూర్తిగా సంతృప్తికరంగా సిద్ధమయ్యే వరకూ వేచి చూడాలని మేకర్స్ భావిస్తున్నారట. కళ్యాణ్ రామ్‌కూ ఈ సీక్వెల్‌పై ప్రత్యేకమైన అంచనాలు ఉండటంతో, బలమైన కథ లేకుండా ముందుకు వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు టాక్.

మొత్తానికి, బింబిసార క్రియేట్ చేసిన హైప్‌ను ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఏ మాత్రం తగ్గలేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అధికారిక అప్డేట్ వచ్చే వరకు అభిమానులు ఓపిక పట్టాల్సిందే. అయితే సరైన కథ సిద్ధమైతే, బింబిసార 2 మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పొచ్చు.

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Kalyan Ram
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

37 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version