కల్యాణ్ రామ్ ఓపెన్ అయిపోయాడు!!!

టాలీవుడ్ హీరోల్లో కల్యాణ్ రామ్ రూటే వేరు అనే చెప్పాలి…ఆయన రెండో సినిమా నుంచే సొంత సినిమాలు చేసుకుంటూ అటు హీరోగాను…ఇటు నిర్మాతగాను దూసుకుపోతున్నారు. అయితే అదే క్రమంలో ఈ హీరోకి పెద్ద హిట్స్ సైతం లేకపోవడంతో ఎలా అయినా ఈసారి భారీ హిట్ కొట్టి ఇండస్ట్రీ ని షాక్ చెయ్యాలి అన్న ఆలోచనతో పూరీ జగన్నాధ్ తో “ఇజమ్”సినిమా చేశాడు. తానే నిర్మాతగా….తానే హీరోగా అన్ని భాద్యతలను నెత్తిన వేసుకుని ఈ సినిమాని భారీగా దాదాపు 26కోట్ల రూపాయలతో నిర్మించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ లో భాగంగా కల్యాణ్ రామ్ సినిమా విషయాలు ఎన్నో తెలిపాడు.

అయితే అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో వక్కంతం వంశీ సినిమా సంగతి సైతం మీడియా అడగడంతో ఓపెన్ అయిపోయాడు కల్యాణ్…ఆ సినిమా గురించి చెబుతూ….’ప్రస్తుతం ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాం. వక్కంతం చెప్పిన స్క్రిప్ట్ పూర్తిగా నచ్చలేదు. అందుకే ప్రస్తుతం ఇంకా బెటర్ లైన్ పై వక్కంతం వర్క్ చేస్తున్నాడు. త్వరలో అప్ డేట్ ఇస్తాం. వక్కంతం-నేను-ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్. త్వరలో మంచి ప్రాజెక్టుతో కలిసి తప్పకుండా పని చేస్తాం ‘ అని తెలిపాడు కల్యాణ్ రామ్…అంతేకాకుండా సినిమా అంటే చిన్న విషయం కాదు కదా అన్నీ చూసుకుని ముందుకు పోవాలి అని తెలిపాడు కల్యాణ్ రామ్. మరి ఈ నెల 21న విడుదలయ్యే కల్యాణ్ రామ్ “ఇజమ్” అతనని ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus