అంత కష్టపడినా…”ఇజం” నష్టమేనా!!!

టాలీవుడ్ లో నందమూరి వారసుల్లో దూకుడుగా సినిమాలు తీసుకుంటూ ముందుకూపోతున్న హీరో నందమూరి కల్యాణ్ రామ్. దాదాపుగా ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు అయినప్పటికీ పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే సాధించలేకపోయాడు. కానీ…సినిమా అంటే కసి, ప్యాషన్ రెండు వెరసి….ఆటుపొట్లను ఎదుర్కుంటూ…ముందుకు పోతున్నాడు ఈ నందమూరి చిన్నాడు…

ఇదిలా ఉంటే అసలు విషయంలోకి వెళితే…కళ్యాణ్ రామ్ తాను లేటెస్ట్ గా నటిస్తున్న ‘ఇజం’ పై గంపెడు ఆసలు పెట్టుకుని దాదాపు 26 కోట్ల భారీ మొత్తాన్ని ఈ సినిమా పై ఖర్చు పెట్టాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే..అదంతా ఒక ఎత్తు అయితే…మరో పక్క ఈసినిమా బిజినెస్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 20 కోట్లకు మించి బిజినెస్ అవ్వలేదు అని తెలుస్తుంది. దీనితో విడుదల కాకుండానే ‘ఇజం’ సినిమాను 6 కోట్ల లాస్ కు కళ్యాణ్ రామ్ అమ్మినట్లుగా గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

అదే క్రమంలో ఈ సినిమా టీజర్, లుక్స్ అన్నింటినీ చూసి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగినప్పటికీ బయ్యర్లు చాల వ్యుహాత్మకంగా వ్యహరించడంతో కళ్యాణ్ ఈసినిమా పై పెట్టుకున్న అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి…ఇక చేసేది ఏమీ లేక…కళ్యాణ్ రామ్ టోటల్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇలా 6 కోట్ల లాస్ తో ‘ఇజం’ బిజినెస్ ను పూర్తి చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఒక రకంగా చెప్పాలి అంటే…ఈ సినిమా రైట్స్ ను కల్యాణ్ రామ్ టోటల్ గా బయ్యర్స్ కి అమ్మేసాడు….అంటే  ‘ఇజం’ ఊహించిన విధంగా సూపర్ హిట్ అయినా కళ్యాణ్ రామ్ కు ఆర్ధికంగా పెద్దగా ఏమి కలిసి రాదు అనే చెప్పాలి….పోనీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యీ…కల్యాణ్ కు తన ఇమేజ్ పెంచుకోవడానికి అయినా ఈ సినిమా ఉపయోగపడితే అంతే చాలు అని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus