కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాలను సెట్స్ పైకి తేవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఎంత మంచివాడవురా ఎంతో విజయాన్ని అందిస్తుందని ఆశలు పెట్టుకున్న ఈ హీరో ఊహించని విధంగా పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే వీలైనంత వరకు నెక్స్ట్ ఒక మంచి సినిమాతో రావాలని అనుకుంటున్నాడు. తాజా అప్డేట్ ఏమిటంటే, కళ్యాణ్ రామ్ మలయాళ చిత్రంపై దృష్టి పెట్టారని టాక్. నెక్స్ట్ రీమేక్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.
ఇటీవల అంజమ్ పాతిరా అనే కథపై తనకు సన్నిహితులైన దర్శక రచయితలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇది కూడా 118 వంటి థ్రిల్లర్. టాక్ ఏమిటంటే, కళ్యాణ్ రామ్‌తో కలిసి 118 హిట్ చిత్రం చేసిన గుహన్ దర్శకత్వం ఈ సినిమాకు వహించనున్నారని సమాచారం. గుహాన్ స్వయంగా ఈ రీమేక్ ఆలోచనను కల్యాణ్ రామ్ వద్దకు తీసుకువెళ్ళాడని మరో టాక్ వినిపిస్తోంది. ఇక త్వరలోనే ఈ రీమేక్ కథను సెట్స్ పైకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.
ఇక మరోవైపు ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథపై కూడా ఈ నందమూరి హీరో ఇంట్రెస్ట్ చూపించినట్లు సమాచారం. అంతే కాకుండా తన సొంత ప్రొడక్షన్ లోనే నెక్స్ట్ సినిమాలను నిర్మించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!