నెట్టింట తెగ వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ కొత్త లుక్..!

  • January 4, 2021 / 07:38 PM IST

ఓ వైపు హీరోగా విభిన్న కథా చిత్రాలను చేస్తూనే మరోపక్క తనకు నచ్చిన క‌థ‌ల‌ని నిర్మిస్తూ కొత్తగా దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటాడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. అందుకే కళ్యాణ్ రామ్ కు ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. ప్రస్తుతం కళ్యాణ్ తన తమ్ముడు ఎన్టీఆర్ నటించే సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక సినిమా సినిమాకి తన లుక్ ను ఛేంజ్ చేస్తూ వచ్చే కళ్యాణ్ రామ్.. ఇప్పుడు కూడా కొత్త లుక్ లోకి మారాడు.విపరీతంగా గడ్డం, మీసాలు పెంచి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు కళ్యాణ్ రామ్.

అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో కూడా ‘ఓం 3D’, ‘ఇజం’ వంటి సినిమాల కోసం కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లోకి మారిన సందర్భాలు ఉన్నాయి. వశిష్ట అనే కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘రావణ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంతో పాటు దిల్ రాజు నిర్మాణంలో కూడా కళ్యాణ్ రామ్ ఓ కొత్త సినిమా చెయ్యబోతున్నాడు.

దీనిని కూడా ఓ కొత్త దర్శకుడే తెరకెక్కిస్తాడని సమాచారం. ఈ రెండు చిత్రాలతో పాటు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడు కళ్యాణ్ రామ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కళ్యాణ్ రామ్ ఫోటోని మీరు కూడా లుక్కెయ్యండి..

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus