సినిమాలకు గుడ్ బై చెప్పనున్న కమల్ హాసన్!

  • December 6, 2018 / 08:01 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ – డైరెక్టర్ శంకర్ కంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996 విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ‘ఇండియన్-2’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు డైరెక్టర్ శంకర్. రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. డిసెంబర్ 14న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్టు సమాచారం.

ఒక పక్క ఈ చిత్ర పనుల్లో బిజీగా ఉంటూనే తన రాజకీయ కార్యక్రమాలతో కమల్ బిజీగా గడుపుతున్నారు. షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఇటీవల కేరళలో జరిగిన ఓ సేవా కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ.. ‘ఇండియన్-2′ చిత్రం తన కెరీర్‌లోనే చివరి సినిమా కావచ్చని కమల్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే నటనకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా కొనసాగుతానని కమల్ చెప్పడం గమనార్హం.’ఇండియన్ 2’ చిత్రంలో కూడా కమల్‌హాసన్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారట. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేయగా… ‘ లైకా’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం వచ్చిన కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సీక్వెల్ ‘విశ్వరూపం 2’ డిజాస్టర్ గా నిలిచింది. మరి ‘ఇండియన్’ సీక్వెల్ ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus