Kamal Haasan: మూడు పవర్‌ హౌస్‌ల సినిమా మూడో తేదీన!

లోక నాయకుడు కమల్‌ హాసన్, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి… ఇంకా ఫహాద్‌ ఫాజిల్‌. ఈ ముగ్గురు కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అందులో నటిస్తున్నది ముగ్గురు నటులు మాత్రమే.. కాదు మూడు పవర్‌ హౌస్‌లు అని చెప్పొచ్చు. తమదైన పాత్ర పడితే… దానిని అంతెత్తున కూర్చోబెట్టగల సమర్థులు.

Click Here To Watch Now

తాజాగా చిత్రబృందం మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేస్తూ సినిమా డేట్‌ చెప్పింది. ఇటీవల త్రీకరణ పూర్తి చేసుకున్న ‘విక్రమ్‌’ సినిమా విడుదల తేదీని సోమవారం ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వేసవి కానుకగా జూన్‌ 3న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ముందుగా చెప్పినట్లు డేట్‌ మాత్రమే కాదు… ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియోను కూడా అభిమానులతో సినిమా టీమ్‌ పంచుకుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన గ్లింప్స్‌ని ఆ వీడియోలో చూపించారు.

ఎక్కువగా రాత్రి సమయాల్లో తీసిన సీన్సే ఆ వీడియోలో ఉన్నాయి. మూడు పాత్రల చిరు పరిచయం, సాంకేతిక నిపుణుల పరిచయంతో వీడియో సాగింది. ఒక్కో ఫ్రేమ్‌ను అలా అలా ముందుకు తీసుకెళ్లి చూపిస్తుంటే గూస్‌ బంప్స్‌ పక్కా అని చెప్పొచచు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ కథానాయకుడు. ఇక విజయ్‌ సేతుపతి, మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇతర కీ రోల్స్‌లో నటించారు. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు.

లోకేశ్‌ సినిమా ఎలా ఉంటుందో ‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలతో చూశాం. ఇప్పుడు కమల్‌ను ఎలా చూపిస్తారనేదే విషయం. సినిమా స్టార్టింగ్‌ సమయంలో విడుదల చేసిన వీడియో వైబ్స్‌ ఇంకా తగ్గలేదు. ఇప్పుడు రిలీజ్‌ చేసిన వీడియోలో ఆ వైబ్స్‌ను కొనసాగించేలానే వీడియో ఉంది. అనిరుథ్‌ సంగీతం, లోకేశ్ కనగరాజ్‌ ఆలోచనలు వీడియోలో పక్కగా కనిపిస్తున్నాయి. ఇక కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ స్క్రీన్‌ అప్పీయరెన్స్‌ ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో జూన్‌ 3న మూడు పవర్‌ హౌస్‌ల పర్‌ఫార్మెన్స్‌ ఒకే స్క్రీన్‌ మీద చూసేయొచ్చు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus