Kamal Haasan: శంకర్ – లైకా లొల్లి.. స్టార్ హీరో సెటిల్మెంట్

సంచలన దర్శకుడు శంకర్ ఒకప్పుడు ఎలాంటి సినిమా స్టార్ట్ చేసినా కూడా అతనికి నిర్మతల నుంచి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఖర్చు పెట్టించడంలో శంకర్ ఏ మాత్రం వెనక్కి తగ్గడు. అనుకున్నది వచ్చే వరకు కూడా వదిలి పెట్టడు. అయితే ఇదంతా కూడా సక్సెల్ లో ఉన్నంత వరకు బాగానే చెల్లింది. రోబో అనంతరం శంకర్ జడ్జిమెంట్ అనేది మిస్ ఫైర్ అవుతోంది. దీంతో భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతోంది.

2.ఓ అనంతరం శంకర్ మాటలకు లైకా వాల్యూ కూడా ఇవ్వడం లేదు. బడ్జెట్, రెమ్యునరేషన్ విషయంలో గొడవలు రావడంతో విషయం కోర్టు వరకు వెళ్లినప్పటికీ సరైన పరిష్కారం దొరకలేదు. అది మీరిద్దరూ కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య అని చెప్పడంతో ఎప్పటిలానే శంకర్ – లైకా ఎడమోహం పెడమొహంతో మళ్ళీ దూరమయ్యారు.ఇక పాలిటిక్స్ కోసమని ఇండియన్ 2ను పక్కన పెట్టిన కమల్ హాసన్ అక్కడ అపజయం రావడంతో మళ్ళీ షూటింగ్స్ పై ఫోకస్ పెట్టాడు.

ఇండియన్ 2 దర్శక నిర్మాతల మధ్య సెటిల్మెంట్ కోసం చర్చలు స్టార్ట్ చేసినట్లు సమాచారం. వీలైనంత త్వరగా మళ్ళీ షూటింగ్ పనులను స్టార్ట్ చేయాలని ఇద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారట. మరి కమల్ హాసన్ మాటలను వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తారో చూడాలి. ఇక శంకర్ ఇటీవల అపరిచితుడు రీమేక్ పై క్లారిటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ 2ను పూర్తి చేసి ఆ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus