Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా రూపొందిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా. ‘సితార ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. దీంతో ‘అనగనగా ఒక రాజు’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Anaganaga Oka Raju

ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉందట. చిన్న స్టోరీ లైన్ తో రూపొందిన పండగ సినిమా ఇదని అంటున్నారు.కొన్ని కామెడీ బ్లాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి అంటున్నారు.అక్కడక్కడా పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ.. నవీన్ పోలిశెట్టి తన వన్ లైన్ పంచ్ డైలాగులతో ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడని చెబుతున్నారు.

ఫస్ట్ చాలా ఫన్నీగా ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా నచ్చేస్తుందట. సెకండాఫ్ అక్కడక్కడా స్లో అయినప్పటికీ.. నవీన్ పోలిశెట్టి వన్ మెన్ షో కారణంగా.. ల్యాగ్ కూడా కవర్ అయిపోతుందట. దర్శకుడు మారి ఈ సినిమాని క్లీన్ ఎంటర్టైనర్ గా మలిచాడు అని అంటున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సంక్రాంతి పండగ మూడ్ కి తగ్గట్టు ఉంటుందట. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus