Kamna Jethmalani: తన బేబీ బంప్ పిక్స్ ను షేర్ చేసిన హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ..!

ముంబై బ్యూటీ కామ్నా జెఠ్మలానీ ‘ప్రేమికులు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత ఈమె హీరో గోపీచంద్ సరసన నటించిన ‘రణం’ చిత్రం హిట్ అవ్వడంతో ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవ్వడంతో తొందరగానే ఫేడౌట్ అయిపోయింది. ‘సామాన్యుడు’ ‘బెండప్పారావు ఆర్.ఎం.పి’ ‘కత్తి కాంతారావు’ వంటి హిట్లు కొట్టినా ఈమె బౌన్స్ బ్యాక్ అవ్వలేకపోయింది.

అటు తరువాత 2014 లో సూరజ్ నాగ్పాల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇదిలా ఉండగా.. ఇటీవల కామ్నా ప్రెగ్నెంట్ అయ్యింది. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో తన బేబీ బంప్ ను చూపిస్తూ.. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. కామ్నా ప్రెగ్నెంట్ అవ్వడం ఇది రెండో సారి. గతంలో ఈమె ఓ పాపకు జన్మనిచ్చింది.

‘ప్రెగ్నెంట్ అవ్వడం, ఓ ఆత్మను క్యారీ చేయడం అనేది ఆశీర్వాదంతో కూడిన, సంతృప్తికరమైన, మాటల్లో చెప్పలేని అనుభూతి.. నా జీవితంలో రెండుసార్లు ఈ అనుభూతి కలిగింది.. నా బేబీ ఎదగడానికి 9 నెలల సమయం పడుతుంది.. దయచేసి పోస్ట్ డెలివరీ సమయంలో జాగ్రత్తగా ఉండండి’.. అంటూ తన ఇన్స్టాలో పేర్కొంది కామ్నా..!

1

2

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus