మాస్ ఏరియాల్లో ‘కాంచన 3’ హవా మామూలుగా లేదు..!

రాఘవ లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘కాంచన 3’. లారెన్స్ నటించి డైరెక్ట్ చేసే ముని సీక్వెల్స్ కు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ ను ‘కాంచన 3’ బాగానే క్యాష్ చేసుకుందని చెప్పాలి. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి వసూళ్ళను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 9.01 కోట్ల షేర్ ను రాబట్టింది.

మొదటి మూడు రోజులకి ఏపీ & తెలంగాణ ‘కాంచన 3’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.05 కోట్లు
వైజాగ్ – 0.96 కోట్లు
సీడెడ్ – 2.0 కోట్లు
ఈస్ట్ – 0.76 కోట్లు
కృష్ణా – 0.69 కోట్లు
గుంటూరు – 0.77 కోట్లు
వెస్ట్ – 0.46 కోట్లు
నెల్లూరు – 0.32 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 9.01 కోట్లు
————————————————-

‘కాంచన3’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి మూడు రోజులకి ఈ చిత్రం 9.01 షేర్ ను రాబట్టింది. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు కానుంది. మాస్ సెంటర్స్ లో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయితే డివైడ్ టాక్ రావడంతో మల్టీప్లెక్సుల్లో ఈ చిత్ర కలెక్షన్లు నెమ్మదించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. మరి మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus