చిరు, పవన్ సినిమాల నుంచి తీసేశారన్న నటుడు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

  • April 24, 2024 / 03:26 PM IST

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో వైజాగ్ కు చెందిన కిషోర్ కుమార్ ఒకరు. ఆ సినిమాలో వినాయకుడి బొమ్మలు గీసే మూగవాడి పాత్రలో నటించి ఈ నటుడు ఆకట్టుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరంగా బిజీ అయిన కిషోర్ కుమార్ ఆచార్య (Acharya) , భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలలో ఛాన్స్ వచ్చినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఆచార్య మూవీ కోసం 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని తాను ఆ సినిమాలో బాగా నటించానని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభినందించారని ఆ నటుడు చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి భుజంపై చేయి వేసి మరీ మాట్లాడేవారని ఆయన వెల్లడించారు. ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూస్తే ఆ సినిమాలో నా సీన్స్ లేవని కిషోర్ కుమార్ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్స్ కు మెగా ఫ్యాన్స్ సమాధానం ఇస్తున్నారు. ఆచార్య సినిమాలో కాజల్ (Kajal Aggarwal) ట్రాక్ నే తీసేశారని కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు నటించినా ఆ సీన్స్ కూడా కట్ అయ్యాయని కథ మార్చడం వల్ల సీన్స్ తొలగించి ఉండవచ్చని అభిమానులు చెప్పుకొచ్చారు.

కిషోర్ కుమార్ భీమ్లా నాయక్ సినిమా కోసం ఒకరోజు షూటింగ్ కు వెళ్లానని మధ్య గ్యాప్ వచ్చిందని తర్వాత నా బదులు వేరే నటుడిని తీసుకున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. ఆ సినిమాలో తర్వాత నా బదులు వేరే నటుడిని తీసుకున్నారని కిషోర్ కుమార్ వెల్లడించడం గమనార్హం.

ఎందుకలా చేశారో అర్థం కాలేదని ఆ విషయాలలో చాలా బాధ పడ్డాడని కిషోర్ కుమార్ పేర్కొన్నారు. యాక్టింగ్ నచ్చకపోవడమో, ఆ రోల్ కు సూట్ కాకపోవడం వల్ల భీమ్లా నాయక్ లో తీసేసి ఉండవచ్చని సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus