Prabhas: ఆ ఫ్లాప్ హీరోయిన్ కు ప్రభాస్ మూవీలో అవకాశం వచ్చిందా?

స్టార్ హీరో ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ప్రభాస్ సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అనే కన్ఫ్యూజన్ అభిమానులలో ఉంది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ పారితోషికం కూడా 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సౌత్ లో హైయెస్ట్ పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ముందువరసలో ఉన్నారు.

సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, కంగనా కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఏక్ నిరంజన్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కంగనా సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. అయితే ప్రభాస్ కంగనా జోడీ రిపీట్ కానుందని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఒక ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ కోసం మేకర్స్ ఈ బ్యూటీని సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రమే నమ్మాల్సి ఉంటుంది. ప్రభాస్ సినిమాల థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.

ప్రభాస్ (Prabhas) సినిమాలకు హిట్ టాక్ వస్తే భారీ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రభాస్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ ఉంది. ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus