Kangna Ranaut: కూలి పాత్రలలో బాలీవుడ్ స్టార్స్ నటించరు: కంగనా

  • May 16, 2022 / 08:18 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కంగనా అందరికీ సుపరిచితమే. ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కంగనా కుఏ మాత్రం అవకాశం దొరికినా బాలీవుడ్ స్టార్ హీరోల గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ఏదో ఒక విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇకపోతే తాజాగా కంగనా నటించిన ధాకడ్ సినిమా ఈ నెల 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు.అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా తన తన సినిమాల కన్నా ఇతర హీరోల గురించి ప్రశంసలు కురిపించడం కొందరు పై విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

మహేష్ బాబుని నిజంగానే బాలీవుడ్ ఇండస్ట్రీ భరించలేదు అంటూ మహేష్ బాబుకు మద్దతుగా నిలబడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి మరో టాలీవుడ్ హీరోపై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ హీరోలను ఏకిపారేశారు.టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన పై ఈమె ప్రశంసలు కురిపించారు. ఒక కూలి పాత్రలో అల్లు అర్జున్ ఎంతో గొప్పగా నటించారు.

ఇలా ఒక కూలి పాత్రలో బాలీవుడ్ హీరోలు నటించడానికి ఏమాత్రం ఇష్టపడరనీ బాలీవుడ్ హీరోలు అందరూ కూడా బాయిల్డ్ ఎగ్స్ అంటూ బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా కంగనా రనౌత్ బాలీవుడ్ హీరోలపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus