Kanguva: తెలుగు రాష్ట్రాల్లో సూర్య మూవీ రైట్స్ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో సూర్యకు (Suriya) ఊహించని స్థాయిలో ప్రేక్షకుల్లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూర్య  నటించిన సినిమాలు తెలుగులో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం జరిగింది. సూర్య ప్రస్తుతం నటిస్తున్న కంగువ  (Kanguva) సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో సూర్య కచ్చితంగా భారీ సక్సెస్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఏడాదే కంగువ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలకు ఆంధ్ర, సీడెడ్ హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. కంగువ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

సూర్య సినిమాలన్నీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్నాయి. కంగువ సినిమా బడ్జెట్ ఏకంగా 500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. సూర్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కంగువ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సూర్య తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కంగువ సినిమా సక్సెస్ సాధిస్తే మరిన్ని ప్రయోగాత్మక సినిమాల దిశగా సూర్య అడుగులు వేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సూర్య ఈ సినిమాకు ఒకింత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సూర్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus